పెళ్ళైన పది రోజులకే భర్తపై కేసు

గ్లామర్ తో యూత్ ని అట్రాక్ట్ చేసిన బోల్డ్ భామ పూనమ్ పాండే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కి ఫొటోస్ రూపంలో ట్రీట్ ఇచ్చే ఈ గ్లామ్ డాల్, పెళ్లి చేసుకున్న మూడు వారాలకే భర్త తనని వేధిస్తున్నాడంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పూనమ్ సెప్టెంబర్ 1న తన లవర్ సామ్ బాంబేని సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. పూనమ్ సడన్ గా పెళ్లి చేసుకోవడమే షాక్ అనుకుంటే, పెళ్లి అయ్యి నెల కూడా తిరగకుండానే భర్తపై వేధింపులు కేసు పెట్టడం ఇంకా షాక్ ఇచ్చే విషయం.

పోలీసుల కథనం ప్రకారం.. పూనమ్ పాండే ఇటీవలే సినిమా షూట్ ఉండడంతో కోసం సౌత్ గోవాలోని కనాకోనాకు పూనమ్, భర్త సామ్ బాంబేతో పాటు వెళ్ళింది. ఇక్కడ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ పూనమ్ పాండే పీఎస్‌కు వచ్చి భర్తపై లైంగిక వేధింపులు మరియు హత్యాయత్న బెదిరింపు ఆరోపణలు చేస్తూ సోమవారం అర్ధరాత్రి ఫిర్యాదు చేసిందని అక్కడి ఇన్‌స్పెక్టర్ తుకారం చవాన్ తెలిపారు. పూనమ్ పాండే ఫిర్యాదు మేరకు ఆమె భర్త సామ్‌ బాంబేను గోవా పోలీసులు సెప్టెంబర్ 22న అరెస్ట్‌ చేశారు. పూనమ్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. లవ్ మ్యారేజీ చేసుకున్న జంట మధ్య 3 వారాల్లోనే గొడవ ఎలా మొదలైంది, అసలేం జరిగింది అనే కోణంలోనూ విచారణ చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ చెబుతున్నారు.