రోహిత్ రస్సెల్ ని అడ్డుకుంటాడా?

IPL 2020 మ్యాచ్ 5 ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. ఫస్ట్ మ్యాచ్‌లోనే చెన్నై చేతిలో ఓడిపోయిన డిఫెండింగ్‌ చాంప్‌ ముంబై ఇండియన్స్ రెండో మ్యాచ్ గెలిచి‌ ఐపీఎల్‌ 13లో బోణీ చేయాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు మొదటి మ్యాచ్ ముంబై లాంటి స్ట్రాంగ్ టీంపై గెలిచి టోర్నమెంట్ కి కిక్ స్టార్ట్ ఇవ్వాలని కోల్కతా భావిస్తుంది. కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తీక్ కి ఇది చాలా పెద్ద టాస్క్. బ్యాటింగ్‌లో ఇరుజట్లూ సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌ బ్యాట్స్‌మెన్‌ మధ్య సమరంగా సాగే అవకాశం ఉంది.

ముంబై కీ ప్లేయర్స్: కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా లాంటి టీమిండియా ఆటగాళ్లతో ముంబై పటిష్ఠంగా కనిపిస్తోంది. ఈ ఇద్దరూ హిట్టింగ్ కి దిగితే ఎలాంటి బౌలింగ్ దళమైన వెనక్కి తగ్గాల్సిందే. ఇక బౌలింగ్ రూపంలో వరల్డ్స్ బెస్ట్ బౌలర్ బుమ్రా ప్రధాన బలంగా నిలుస్తున్నాడు కానీ డెత్ ఓవర్లలో మలింగా లేని లోటు కనిపిస్తుంది.

కోల్కతా కీ ప్లేయర్స్: టోర్నమెంట్ లో యంగ్ ఇండియన్ ప్లేయర్స్ బాగా రాణిస్తూ ఉండడంతో ఈరోజు అందరి కళ్ళు యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌పైనే ఉంటాయి. టాలెంటెడ్ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న గిల్ కోల్కతాకి ట్రంప్ కార్డు అయ్యే అవకాశం ఉంది. ఇతనికి తోడుగా విండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ ఆండ్రీ రస్సెల్‌ ఎలాగూ ఉన్నాడు. ఇంతక ముందు మిడిల్ ఆర్డర్ లో వచ్చే రస్సెల్ ఇప్పుడు టాపార్డర్‌లో ఆడనుండడం నైట్‌రైడర్స్‌కు ప్లస్‌ కానుంది. కావాల్సినంత సమయం ఉంటుంది కాబట్టి రస్సెల్ నెమ్మదిగా ఆడి కుదురుకున్న తర్వాత హిట్టింగ్ మొదలు పెడితే ముంబైకి కష్టాలు తప్పవు. బౌలింగ్‌లో కమిన్స్‌ పెద్దదిక్కుగా ఉండగా అతనికి శివమ్ మావి సపోర్ట్ ఇవ్వనున్నాడు.