బిగ్ బాస్ 1 కంటెస్టెంట్ ప్రేమ పెళ్లి

నేను, నువ్వొస్తానంటే నేను వద్దంటానా, పౌర్ణమి, ఖలేజా సినిమాల్లో కనిపించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు అమ్మాయి అర్చన వేద. చాలా రోజులుగా సినిమాలకి దూరంగా ఉంటూ సెలెక్టివ్ రోల్స్ మాత్రమే చేస్తున్న అర్చన, ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌ జగదీశ్‌ నిశ్చితార్థం నిన్న ఘనంగా జరిగింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగిన నిశ్చితార్థ కార్యక్రమానికి అర్చన బిగ్ బాస్ ఫ్రెండ్స్ నవదీప్, శివబాలాజీ, సుమంత్, నటి మధుమిత తదితరులు హాజరయ్యి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు కూడా హాజరయ్యారు. అర్చన జగదీశ్‌లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. గత నెలలోనే ప్రియుడు జగదీశ్‌తో కలిసి దిగిన ఫొటోను అర్చన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసి, తమ ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టింది. 2004లో ఖనేనుగ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అర్చన తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్‌ వన్‌ లో కంటెస్టెంట్ గా వెళ్లి మంచి పేరు తెచ్చుకుంది.