సైరా తర్వాత మరో పవర్ఫుల్ పాత్రలో తమన్నా

స్పీడ్ పెంచిన యాక్షన్ హీరో గోపీచంద్, గౌతమ్ నందా కాంబినేషన్ రిపీట్ చేస్తూ సంపత్ నందితో సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నిన్న రామానాయుడు స్టూడియోలో పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాలో తమ్మన్నా హీరోయిన్ గా నటిస్తోంది. సంపత్ నందితో తమన్నాకి ఇది మూడో సినిమా కావడం విశేషం. మొదటిసారి సంపత్ నందితో రచ్చ సినిమా చేసిన మిల్కీ బ్యూటీ, ఆ తర్వాత బెంగాల్ టైగర్ సినిమా చేసింది. ఇప్పుడు గోపీచంద్ సినిమాకి ఓకే చెప్పి సంపత్ నందితో మూడో సినిమా చేస్తోంది. గత రెండు సినిమాలతో వచ్చిన రాపో కారణంగా సంపత్ నంది తమన్నాకి మంచి రోల్ డిజైన్ చేశాడని సమాచారం.

స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రా మహిళా కబడ్డీ టీమ్ కోచ్‌గా కనిపించనున్నాడు. తెలంగాణ మహిళా కబడ్డీ కోచ్‌గా తమన్నా నటిస్తోంది. సైరా సినిమాలో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన తమన్నా, మరోసారి అదే రేంజ్లో కోచ్ గా నటించనుంది. లీడ్ పెయిర్ తో పాటు మరో 25 మంది ప్లేయర్స్ కనిపించనున్నారు. బలమైన కథతో భావోద్వేగప్రధానంగా సాగే సినిమా ఇదిని సంపత్ నంది ఇది వరకే చెప్పాడు. మరి కాబట్టి కోచ్ గా తమన్నా ఎంత వరకూ మెప్పిస్తుందో తెలియాలి అంటే కొంత కాలం ఆగాలి. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సౌందర్‌రాజన్, ఆర్ట్: రాజీవ్‌నాయర్, సమర్పణ: పవన్‌కుమార్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్‌నంది.