సూపర్ స్టార్ హిజ్రా లుక్ అదిరింది

హారర్ సినిమాలకి కొత్త అడ్రెస్ చెప్పిన దర్శకుడు రాఘవ లారెన్స్. ఇప్పటి వరకూ ఒకే పేరుతో మూడు సినిమాలు చేసి ఒకదాన్ని మించి మరొక హిట్ ఇచ్చిన ఏకైక దర్శకుడు లారెన్స్ మాత్రమే. ఇండియాలోనే మోస్ట్ సక్సస్ ఫుల్ సిరీస్ లో కాంచన సినిమా సిరీస్ అయిన మూవీ సిరీస్ మరొకటి లేదు. ఖోరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన లారెన్స్, తన సినిమాల్లో సూపర్ హిట్ మూవీ కాంచన 2ని హిందీలో తెరకెక్కిస్తున్నాడు.

లక్ష్మీ బాంబ్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ ఫస్ట్ లుక్ లో అక్షయ్ కుమార్ హిజ్రా లుక్ లో కనిపించి బాలీవుడ్ వర్గాలని ఆశ్చర్యపరిచాడు. కాళీ మాత గుడిలో ఎర్ర చీర ధరించి, ముఖాన పెద్ద బొట్టుతో ఉన్న అక్షయ్ లుక్ అక్కడి సినీ అభిమానులని ఆకట్టుకుంటోంది. అక్షయ్ కుమార్ సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న లక్ష్మీ బాంబ్
వచ్చే ఏడాది వేసవి కానుకగా రానుంది.