భారీ రేటుకు ‘BB3’ హక్కులు

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి వర్కింగ్ టైటిల్‌గా BB3 అని పెట్టగా.. త్వరలో సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నారు. మోనార్క్ అనే టైటిల్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించగా… ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.

BB3

ఈ సినిమా ఆంధ్రా హక్కులు రూ.35 కోట్లకు అమ్ముడుపోయాయని చెబుతున్నారు. ఇక మరో రెండు, మూడు రోజుల్లో నైజాం, సీడెడ్ హక్కులు కూడా అమ్ముడయ్యే అవకాశముంది. బాలకృష్ణకు సీడెడ్ ఏరియా అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో సీడెడ్ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇందులో బాలయ్య రెండు పాత్రలలో నటించగా.. ఒక పాత్రలో అఘోరాగా నటించనున్నాడు.