ఓటీటీలో సైనా నెహ్వాల్ బయోపిక్

ఇటీవల బయోపిక్‌ల ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. బయోపిక్ సినిమాలు ఎక్కుగా వస్తున్నాయి. వివిధ రంగాల్లో విజయం సాధించిన ప్రముఖలు బయోపిక్ సినిమాలను తెరకెక్కించేందుకు దర్శక, నిర్మాతలు ముందుకొస్తున్నారు. ప్రముఖ నిజజీవిత కధల ఆధారంగా తెరకెక్కే బయోపిక్ సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే అనేకమంది ప్రముఖులపై బయెపిక్ సినిమాలు రాగా.. తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ రాబోతున్న విషయం తెలిసిందే.

siana nehwal biopic OTT

బాలీవుడ్ టాప్ హీరోయిన్ పరిణితి చెప్రా ఇందులో సైనా నెహ్వాల్‌గా నటించగా.. ఈ బయోపిక్‌ సినిమాకు సైనా అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. లాక్‌డౌన్ వల్ల వాయిదా పడింది. అయితే త్వరలో ఓటీటీలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.