Bollywood: బ్యాటింగ్ చేస్తున్న ప్ర‌ముఖ‌ హీరోయిన్.. సోష‌ల్ మీడియాల్ హ‌ల్‌చ‌ల్‌!

Bollywood: తెలుగు, హిందీ ప‌లు భాష‌ల్లో న‌టిస్తూ సినీ ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ తాప్సీ.. తెలుగులో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన ఝుమ్మందినాదం చిత్రంతో తాప్సీ హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయింది. ఆ త‌ర్వాత తెలుగులో ప‌లు చిత్రాలు చేస్తూ న‌టిగా ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. కానీ ఆమెకు తెలుగులో స‌రైనా అవ‌కాశాలు లేక Bollywoodబాలీవుడ్‌కు వెళ్లిపోయింది.

Thaapi new moove

బాలీవుడ్ మొద‌టి చిత్రంతోనే మంచి విజయం అందుకున్న తాప్సీ.. బాలీవుడ్ ప‌లు చిత్రాల్లో న‌టించి అక్క‌డి ప్రేక్ష‌కుల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంది తాప్సీ. ఈ నేప‌థ్యంలోనే Bollywoodఅక్క‌డ ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. ప్ర‌స్తుతం తాప్సీ న‌టిస్తున్న Bollywood ర‌ష్మీ రాకెట్ చిత్రంలో అథ్లెట్‌గా క‌నిపించేందుకు ఆమె ఎంతో క‌ష్ట‌ప‌డింది. ఓ వైపు జిమ్‌లు చేస్తూ.. మ‌రోవైపు రన్నింగ్ రేసుల్లో పాల్గొంటూ అథ్లెట్‌గా త‌న బాడీని మ‌లుచుకుంది. ఇక అలాగే తాప్సీ మ‌హిళ టీంఇండియా మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న Bollywood శ‌భాష్ మిథూ చిత్రంలో ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో న‌టిస్తుంది. దీంతో ఈ సినిమా కోసం కూడా క్రికెట‌ర్‌గా క‌నిపించేందుకు ఎంతో క‌స‌ర‌త్తులు చేస్తుంది. క్రికెట్ కోచ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తూ క‌నిపించింది తాప్సీ. దీంతో దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. Bollywoodఈ సినిమా మ‌హిళ మాజీ సార‌థి క్రికెట‌ర్ మిథాలీరాజ్ బ‌యోపిక్‌గా తెర‌కెక్కుతుండడంతో.. అటు క్రికెట్ అభిమానులు, మ‌రోవైపు అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.