Bopal: హిందూ దేవ‌త‌ల వివాదంపై క‌మెడియ‌న్ అరెస్ట్‌‌.. బెయిల్ ఇవ్వ‌న‌న్నా హైకోర్టు!

Bopal: ఓ షోలో క‌మెడియ‌న్ మునావ‌ర్ ఫారూకీ హిందూ దేవ‌త‌ల‌పై కామెడీ చేశాడు. ఈ నేప‌థ్యంలో హిందూ దేవ‌త‌ల‌ను కించ‌ప‌రుస్తూ.. హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా ప్ర‌వ‌ర్తించి‌న క‌మెడియ‌న్ ఫారూకీపై మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన‌ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు ఒక‌రు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో జ‌న‌వ‌రి రెండ‌వ తేదీన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లో ఫారూకీతో పాటు అత‌ని స‌న్నిహితుల్ని అరెస్ట్ చేశారు.

comedian

Bopal అయితే త‌న వీడియోల్లో కామెడీ చేస్తూ.. హిందూ దేవ‌త‌లను అవ‌మానించిన‌ట్లు మునావ‌ర్ ఫారూకీతో పాటు మ‌రో ఇద్ద‌ర్నీ క‌స్ట‌డీలోకి తీసుకోవాల‌ని ఆదేశించింది మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టు. అయితే ఈ కేసుపై గురువారం మ‌ళ్లీ వాద‌న జ‌రిగింది. ఈ క్ర‌మంలో ఈ కేసుపై సంబంధించిన వివ‌రాల‌ను Bopal పోలీసులు ప్రొడ్యూస్ చేయ‌క‌పోవ‌డంతో క‌మెడియ‌న్ల‌కు బెయిల్ ఇవ్వ‌లేమ‌ని చెప్పింది.