అవినాష్‌కి ముగ్గురు పిల్లలట

బిగ్‌బాస్-4 మరో నాలుగు వారాలు మాత్రమే మిగిలి ఉంది. దీంతో గేమ్ రసవత్తరంగా మారింది. కంటెస్టెంట్స్ అందరూ స్ట్రాంగ్‌గా ఆడుతున్నారు. ఇప్పటికే చాలామంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వగా.. ప్రస్తుతం అమినాష్, మోనాల్, అఖిల్, అరియానా, సోహెల్, అభిజిత్, హరికలు మాత్రమే హౌస్‌లో ఉన్నారు. గత వారం యాంకర్ లాస్య హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

ఇక ఏడుగురు కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్‌లో మిగిలి ఉన్నారు. దీంతో హౌస్ నుంచి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఉత్కంగా మారింది. ఇవాళ నామినేషన్ల ప్రక్రియ జరగనుందనేది జర. అయితే తాజాగా విడుదలైన బిగ్‌బాస్ ప్రోమో చాలా ఆసక్తికరంగా మారింది.

హౌస్‌లో బాగా ఎంటర్‌టైన్ చేసే జబర్దస్త్ కమెడియన్ అవినాష్‌ను అరియానా, సోహెల్ ఒక ఆట ఆడుకున్నారు. ‘అవినాష్ నువ్వు షర్ట్‌లు వేసుకోకు.. అంకుల్‌లా ఉంటావు’ అని అరియానా అనగా.. ‘ఎవరు అంకుల్.. నువ్వు ఆంటీ’ అని అరియానాను అవినాష్ అంటాడు. ‘నువ్వు నడుచుకుంటూ వస్తుంటే ముందు నీ బోజ్జ నడుస్తుంది’ అని అరియానా అంటోంది. ఈ సందర్భంగా సోహెల్ వచ్చి ‘బోజ్జ ఎక్కడిది.. ఇదిగో చూపించు.. మా వోడికి అన్ అఫీషియల్‌గా ముగ్గురు పిల్లలు ఉన్నారు’ అని సోహెల్ అంటాడు. చూడటానికి ఆ ప్రొమో చాలా ఆసక్తికరంగా ఉంది.\