కేసీఆర్‌కి ధన్యవాదాలు చెప్పిన సినీ పెద్దలు

టాలీవుడ్‌కి వరాలు ప్రకటించడంపై సీఎం కేసీఆర్‌కు సినీ పెద్దలు కృతజ్ణతలు తెలిపారు. హీరో చిరంజీవి, నాగార్జునతో పాటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణ్ దాస్ నారంగ్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఛైర్మన్ సి .కల్యాణ్ ధన్యవాదాలు చెప్పారు. ఇవాళ జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ విడుదల చేశారు.

C KALYAN

ఈ సందర్భంగా టాలీవుడ్‌పై సీఎం కేసీఆర్ వరాల జల్లులు కురిపించారు. సినిమా థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఈ రోజే దీనికి సంబంధించిన జీవో వస్తుందని చెప్పారు. రూ.10 కోట్ల లోపు బడ్జెట్ ఉన్న సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్ మెంట్ సామం అందిస్తామన్నారు. అలాగే థియేటర్లలో టికెట్ల ధరలు సవరించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు.

ఇక థియేటర్లకు కరెంట్ బిల్లులు మాఫీ చేస్తామని కేసీఆర్ చెప్పారు. 40 వేల మంది సినీ కార్మికులకు రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు అందిస్తామన్నారు. కాగా ఆదివారం చిరంజీవి, నాగార్జునతో పాటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణ్ దాస్ నారంగ్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఛైర్మన్ సి .కల్యాణ్ వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిసి సినీ సమస్యలపై చర్చించారు.