చిరంజీవిని ఆ విషయంలో విమర్శించే నైతిక ‘హక్కు’ ఎవరికీ లేదు…

ఒక సాదరణ కానిస్టే బుల్ కొడుకుగా పుట్టి.. B.com., వరకూ చదువుకుని, సినిమాలపై మోజు పెంచుకుని, హీరో అవుదామని.. మద్రాసు వెళ్ళి.. ఫిలిం ఇనిస్ట్యూట్ లో చేరి.. ఫ్రెండ్స్ తో రూముల్లో ‘వంటలు’ అవీ చేసుకుని.. హీరో అవటానికి కావలసిన అర్హతల కోసం.. Excersise లు చేసి..ఫోటోలు పట్టుకుని.. ఆఫీసుల చుట్టూ తిరిగి.. అవకాశాలు అందిపుచ్చుకుని.. నిరంతరం శ్రమించి, ఎంతో.. home workచేసి.. ఎన్నో టెన్షన్స్ పడి .. మెట్టు.. మెట్టు ఎక్కి.. “మెఘాస్టార్” స్తాయికి ఎదిగిన వ్యక్తి.. శ్రీ చిరంజీవి గారు.

ఆయన సంపాదించిన ఆస్తిపాస్తులలో .. అవినీతి గానీ, అక్రమార్జన గానీ, అన్యాయపు సంపాధన గానీ మచ్చుకైనా వుందా..? ఒక పక్క.. సిన్సియర్ గా Income tax లు, GST లు కడుతూ.. వచ్చిన దానిని.. జాగర్తగా Invest చేసి.. ఈ stage కి వచ్చాక.. Blood bank, Eye bank పెట్టి.. ఎందరికో నేత్రదానం.. ఇంకెందరికో.. రక్తం ఇవ్వడం ద్వారా.. ప్రాణ దానం చేస్తున్నారు. వరదలొచ్చినా.. తుఫాన్ లు వచ్చినా.. సునామీలు వచ్చినా.. పరిశ్రమలో స్లంప్ లు వచ్చినా.. చివరిగా ఈ కరోనా మహమ్మారి వచ్చినా.. అనాటి NTR, ANR, కృష్ణ, కృష్ణంరాజ శోభన్తబాబు గారి నుంచి ఈనాటి సీనియర్ హీరోల వరకు.. బాలకృష్ణ గారు, నాగార్జున గారు, మోహన్ బాబుగారు పవన్కళ్యాణ్ గారు మహేష్ గారు, ప్రబాస్ గారు,జూ: N T R గారు Ramcharan గారు, Allu Arjun గారి దగ్గర్నుంచి.. యువ కధానాయుకులందరి వరకూ ఎవరికి తగ్గ స్తాయిలో.. వారు సాయం అందిస్తూనే.. వున్నారు. ఇప్పడు..
ఒక అడుగు ముందుకేసి.. శ్రీ చిరంజీవి గారు అందరి హీరోలను.. నిర్మాతలను.. దర్శకులనూ కో-ఆర్డినేట్ చేసి.. C .C. C. ( కరోనా క్రైసిస్కమిటీని)
ఏర్పాటు చేసి..ఆకలితోనూ.. అవసరం లోనూ.. వున్న 24 Crafts లోని.. సినీ కార్మికులకు.. గ్రోసరీస్, మందులు, వ్యాక్సిన్ లు సరఫరా చేసి… అందరినీ ఆదుకుని.. మహోన్నత వ్యక్తిగా.. పేరు తెచ్చుకున్నారు. అంతే కాదు.. ఆర్ధికంగా ఇబ్బందులో వున్న కళాకారులెందరికో.. ఆయన ఎవరికీ తెలియని.. ఎన్నెన్నో ‘సాయాలు’ చేశారు. అంతెందుకు.. మా దర్శకుల దినోత్సవ.. ఫంక్షన్ కి cheif huest గా పిలిస్తే.. ఆయన వచ్చి.. తన ఎదుగుదలకు కారణం.. దర్శకులేనని.. గుర్తు పెట్టుకుని.. “దర్శకుల సంఘం” ఏర్పాటు చేసిన ” TRUST ” కి.. అప్పటికప్పుడు.. స్పందించి.. 25,00,000 ల రుపాయల విరాళాన్ని ప్రకటించిన విశాల హృదయం ఆయనిది. దాసరి గారి తర్వాత.. పరిశ్రమలో గానీ, అసోసియేషన్స్ లో గానీ.. ఏ ‘సమస్య’ వచ్చినా.. Solve చేసి, చక్కబెట్టగలిగే “పెద్దరికం” ఆయనది. ఆక్సిజన్ కొరతను గమనించి.. అన్ని ఏరియాలలో ఆక్సిజన్ banks పెట్టడానికి సన్నహాలు చేస్తూ.. ఇంకా ఎన్నో విస్తృత సేవలు.. చేయడానికి. వారి అబ్బాయి.. కోడలు రామ్ చరణ్ గారు, ఉపాసనా గారు.. ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారని తెలిసింది. అంతేకాదు.. పరోక్షంగా ఆయన కెరీర్ ని.. ఆయన క్రమశిక్షణను.. కృషిని, పట్టుదలని.. సినిమాలలో ఆయన చేసే నృత్యాలనూ.. న్యాయం కోసం.. ఆయన చేసే పోరాటాలను.. సమాజానికి.. ఆయన పాత్ర ద్వారా చెప్పే సందేశాలను చూసి.. ప్రేరణ పొందిన ఎందరో యువకులు.. తమ తమ goals సాధించి.. హీరోలుగానూ.. స్థిరపడి సమాజ సేవకులుగా.. మారి.. వారి స్తాయిలో వారు.. సమాజానికి ‘సేవ’ చేస్తున్నారు. ఆయనకున్న అపరిమితమైన అభిమానులు.. సమాజంలో ఎన్నో మంచిపనులు.. చేస్తూ ఎందరికో.. అన్నదానాలు.. రక్త దానాలు చేస్తున్నారు.

ఇలాంటి గొప్ప వ్యక్తిని social మీడియాలో ఎవరి ఇష్టానుసారంగా.. వాళ్ళు ‘ Trolls, చేస్తే.. Facebook లో post లు.. పెడుతుంటే.. పిచ్చి పిచ్చిగా కామెంట్స్ పెడుతుంటే చూసి.. బాధతో.. ఆయన గురించి తెలిసిన వ్యక్తిగా.. తట్టుకోలేక.. నేను ఇలా స్పందిస్తున్నాను. అంతేగానీ.. నాకు వేరే..
ఏ ఎజెంఢా లేదు. ఎందుకంటే.. నాది ఆయన కులం కాదు. ఆయన జిల్లా కాదు. ఇంత వరకూ ఆయనతో ఏ సినిమా Direction department లో గానీ, Actor గా గానీ work చెయ్యలేదు. ఎందుకో.. ఈ మధ్య ఆయనను కొంచెం దగ్గరగా చూసిన వాడిగా.. ఇలా ప్రేమతో React అవుతున్నాను. అసలు.. దేశ విదేశాలలో.. బిల్ గేట్ట్స్, వారెన్ బఫెట్ లాంటి వారు ఎంతో మంది ఎన్నో రకాల ‘సాయాలు’ చేస్తున్నారు. కోట్ల డాలర్స్ లో.. విరాళాలు ఇస్తున్నారు
వారి ‘వయస్సు’, ‘కుటుంబ నేపధ్యం’ బట్టి. వారు అలా చేస్తున్నారు. కుటుంబంలో ఇద్దరో.. ముగ్గురో వుంటారు. వయసు బాగా మీద పడిపోతుంది.. వారసులు ఎవరూ వుండరు.. అందుకే ఉన్న ఆస్తిపాస్తుల్ని.. ఎక్కవ మొత్తంలో.. వారు చారిటీస్ కి ఇస్తూవుంటారు. అలా చెయ్యడానికి కూడా.. ఎంతో విశాలమైన హృదయం వుండాలి. అది వేరేవిషయం. అలాగే మన దేశంలో.. రతన్ టాటా గారు..అలాగే.. ఇంకా ఎంతో మంది పారిశ్రమికవేత్తలు ఎందరో ధనవంతులు.. దాతలు.. ఎన్నో రకాలుగా.. ఎన్నో రూపాలలో.. విరాళాలు ఇస్తూ.. ‘సాయం’ చేస్తున్నారు. వాళ్ళెవరికీ లేని పోటీ.. ” మా ” సినిమా హీరోలకు ఎందుకు.. క్రియేట్ చేస్తారో.. అర్ధం కావడంలేదు. సాయం చేయడం… అనేది రక రకాలుగా వుంటుంది. కొందరు Publicity తో చేస్తారు.
ఇంకొందరు సంతృప్తి కోసం చేస్తారు. మరి కొందరు.. ఎవరికీ తెలియకుండా..గుప్త దానాలు చేస్తారు. ఎవరికి నచ్చిన పద్దతిలో.. వాళ్ళు చేస్తూవుంటారు.
ఎందుకంటే.. ఇప్పుడున్న కరోనా పేండమిక్ సిట్యువేషన్ లో.. ‘సాయం’ అవసరం.. ప్రతీ మనిషి చుట్టూ.. ‘వైఫై’ లా అలుముకుని వుంది. ఎవరు ఎవరికి చేస్తున్నారో.. ఎప్పుడు.. ఎలా చేస్తున్నారో అంతా.. తెలియకుండానే జరిగిపోతుంది. కాబట్టి.. చిరంజీవి గారు.. వారి అమ్మగారికి చేపల కూర వండిపెట్టినా.. నాగార్జున గారికి చికెన్ చేసి పెట్టినా.. అది వారి personel విషయం.

ఏం.. ఎవరూ.. ఇతరులు కష్టాలలో వున్నారని.. తిండి తినడం మానేశారా.. ? బాధల్లో వున్నారనీ బతక్కుండా చనిపోతున్నారా.! విచ్చలవిడిగా Non veg. కోసం చేపల మార్కెట్ట్స్ కి.. మందు తాగడం కోసం బ్రాందీ షాపుల చుటాటూ తిరిగి.. కరోనా మహమ్మారిని spread చేయడం లేదా..? ఎప్పుడూ బిజిగా వుండే ఆయనకు బోర్ కొట్టి.. మదర్ తోనో, మనవరాలితోనో.. చిన్న.. చిన్న.. moments you tube లో పెడితే.. ఇంత రాద్దాంతమా..? ఒకరకంగా
ఎందరో..చిరంజీవి గారు పెట్టిన homely వీడియోలు చూసి.. ప్రేరణ పొంది.. బయటకి వెళ్ళకుండా ఇంట్లోనే వుండి వంటలు చేసి ఫ్యామిలీస్ కి help చేసిన వాళ్ళున్నారు. అసలూ.. బయటికెళ్ళకుండా.. 24 గంటలు ఇంట్లోనే వుంటూ.. Tvలు చూడ్డం.. ఫోన్లు మాట్లాడుకోడం. సరదాగా వంటలవీ చేసుకోడం మంచిదా.. లేక బయట తిరిగి కరోనాల బారినపడి.. ఇబ్బందులు కొనితెచ్చుకోవడం మంచిదా.. అనేది కొందరు నెటిజన్స్ అర్ధం చేసుకోవాలి. అంతెందుకు.. social media లో.. పెద్ద వాళ్ళను criticise చేసి..Fame సంపాదించాలనుకునే.. ఈ Negetive post లు, కామెంట్స్, Trolls పెట్టే వాళ్ళు.. ఇలా ఎవరినో ఇరిటేట్ చేసే కంటే.. ఎవరికైనా సాయం చేసే కార్యక్రమాల మీద దృష్టి పెడితే.. ఎంతో మంచిది. ఒకరిని ‘hurt’ చెయ్యడానికి ఇంకొకరిని పొగడ్డం.. ఒకరిని పొగడ్డం కోసం.. ఇంకొకరిని “hurt’ చెయ్యడం.. ఇదెక్కడి culture..? రాజకీయనాయకుల జోలి కెళితే.. case పెట్టి.. jail ల్లో.. పెడతారని భయం. విజ్ఞతతో పట్టించుకోని సిమావాళ్ళ మీదకు మాత్రం ఈజీగా వచ్చేస్తారు. వ్యక్తిగతంగా విమర్శంచేస్తారు.

అలాగే బహు బాషా నటుడు “సోనూసూద్ ” గారు ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందరో ఆయన్ని కొనియాడుతున్నారు. ఆయన ప్రమేయం లేకుండానే.. ఆయన చేసే మంచి పనులకు మంచి పబ్లిసిటీ ఇస్తున్నారు. ఆయన లాగే.. హిందీ పీల్డ్ లో.. అమితాబ్ బచన్ గారు.. అక్షయ్ కుమార్ గారు లాంటి హీరోలు కూడా… ఎందరో ‘సాయం’ చేస్తున్నారు.

వాళ్ళందరూ.. మా సినిమా వాళ్ళేగా ! వారందరిలో.. సోనూసూద్ గారికి.. ‘సేవ’ చెయ్యాలనే ‘ఆశక్తి’ చేసే.. ‘శక్తి’ మెండుగా వున్నాయి. పైగా అన్ని బాషల వారికి తెలుసు కాబట్టి.. ఇతర రాష్ట్రాలలో.. కూడా చేస్తున్నారు. కాబట్టి అందరూ ఆయనలా.. చేయాలని రూలేంలేదుకదా! మీ Trolls వల్ల.. ఇండస్ట్రీ లో అందరితో కలిసి పోయి.. అందరిలో.. కలివిడిగా.. సింపుల్ సిటీని ఇష్టపడే సోనూసూద్ గారికి కూడా.. ఇబ్బంది పడే ‘పరిస్తితి’ ఎందుకు కలిగిస్తారు..? వాక్ స్వాతంత్ర్యం ఇచ్చినది.. ప్రభుత్వ తప్పిదాలని, పార్టీ సిద్దాంతాలని.. వ్యవస్థ లోపాలని.. విమర్శించడానికి గానీ.. ఇలా వ్యక్తిగత దూషణల కోసం కాదని గుర్తెరిగితే.. Negetive mind తో వున్న వాళ్ళందరికీ మంచిది.