విమాన ప్రమాదంలో టార్జాన్ మృతి

1989లో రిలీజ్ అయిన టార్జాన్ సినిమాతో ప్రపంచవ్యాప్త సినీ అభిమానులని మెప్పించిన నటుడు జోయ్ లారా. కండలు తిరిగిన దేహం, పొడవైన జుట్టుతో అచ్చం అడవి మనిషిలాగే కనిపించే జోయ్ లారా మే 29న మరణించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమెరికాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో జోయ్ లారా మరణించారు. ప్రయాణికులతో వెళ్తున్న జెట్ విమానం కూలిపోవడంతో జోయ్ లారాతో పాటు ఏడుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. టెన్నెస్సి నుంచి ఫ్లోరిడాకు విమానం వెళ్తున్న విమానం శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాదానికి గురైంది.

TARZAN: THE EPIC ADVENTURES, Joe Lara, 1996-2000, ©Keller Siegel Entertainment / Courtesy: Everett Collection

సౌత్​ నాష్​విల్లేలోని పెర్సీ స్ట్రీక్​ లేక్​లో విమాన శకలాలు కూలినట్లు ఫెడరల్ ఏవియేషన్​ అడ్మినిస్ట్రేషన్​ ప్రకటించింది. ఈ ఘటనలో చనిపోయినవాళ్లలో నటుడు జోయ్​ లారా, అతని భార్య గ్వెన్​ ష్వాంబ్లిన్ ఉన్నారు. ఈ ఘటనలో శకలాలు చెల్లాచెదురయ్యాయని.. సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

1989లో వచ్చిన టార్జాన్ ఇన్​ మాన్​హట్టన్ సినిమా ద్వారా ఫేమస్​ అయిన జోయ్ లారా, ఆ తర్వాత 1996 నుంచి ఏడాదిపాటు టెలికాస్ట్ అయిన టార్జాన్​ ది ఎపిక్​ అడ్వెంచర్స్ టీవీ సిరీస్​ ద్వారా గ్లోబల్​ వైడ్ ఫ్యాన్​ ఫాలోయింగ్​ను సంపాదించుకున్నారు. మార్షల్​ ఆర్ట్స్ ప్రావీణ్యం ఉన్న లారా.. టార్జాన్​ పాత్ర చేసే సమయంలో డూప్​ లేకుండా స్టంట్స్​ చేసేవాడు. ఇక చాలా ఆలస్యంగా 55 ఏళ్ల వయసులో లారా.. గ్వెన్​ ష్వాంబ్లిన్​ను 2018లో వివాహం చేసుకున్నాడు. పెళ్లైన మూడేళ్లకే ఈ ఇద్దరూ మరణించడం బాధాకరం. జోయ్ లారా మరణ వార్త విని హాలీవుడ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.