గ్యాప్ ఇవ్వలేదు… వచ్చింది… అల్లు అర్జున్ రేంజులో ఆన్సర్ ఇచ్చిందిగా

నా పేరు సూర్య నా ఇళ్లు ఇండియా రిజల్ట్ తర్వాత అల్లు అర్జున్ దాదాపు రెండూళ్ల పాటు సినిమాలకి దూరంగా ఉన్నాడు. 2020లో మళ్లీ సినిమా చేసిన బన్నీ అల వైకుంఠపురములో మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేసిన టైములో, మురళి శర్మ అల్లు అర్జున్ ని ఒక మాట అడుగుతాడు. గ్యాప్ ఇచ్చావ్ ఏంట్రా? అని, ఈ మాటకి బన్నీ ఇవ్వలేదు వచ్చింది అంటూ ఫ్యాన్స్ కి కావాల్సిన ఆన్సర్ ఇచ్చేశాడు. ఇప్పుడు ఇదే రేంజులో క్రాక్ బ్యూటీ కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ కూడా ఒక క్వేషన్ కి ఆన్సర్ ఇచ్చింది. క్రాక్, వకీల్ సాబ్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకోని ప్రస్తుతం ప్రభాస్ పక్కన నటిస్తున్న శృతి గతంలో కొంత కాలం పాటు సినిమాలకి దూరంగా ఉంది.

బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ క్రేజ్ లో ఉన్న టైంలోనే సినిమాలకి కాస్త దూరం జరిగిన శృతి, ఈ సమయంలో ఇంగ్లండ్ సింగర్ మైకేల్ కోర్సలేతో ప్రేమలో పడింది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వీరి ప్రేమకు బ్రేక్అప్ చెప్పి శృతి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ ఆన్లైన్ ఇంటర్వ్యూలో ఆమె గతంలో వచ్చిన గ్యాప్ గురించి చెప్తూ… విరామం అనేది అవకాశాలు లేక వచ్చింది కాదు… నాకు నేనుగా తీసుకున్నదే. అది నన్ను నేను ఎంతగానో మార్చుకోవడానికి తీసుకున్న నిర్ణయం అంటూ క్లారిటీ ఇచ్చింది. అలాగే ఈ గ్యాప్ టైములో నాకిష్టమైన సంగీతంపై దృష్టి పెట్టి దాంట్లో కొంత ప్రావీణ్యం సంపాదించాను. అటు నటనను, ఇటు నాకు ఇష్టమైన సంగీతాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలన్న విషయంపై శ్రద్ధ పెట్టాను, ప్రస్తుతం నా కెరియర్ చాలా బిజీగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది.