‘ఆదిపురుష్’ లో ఆ హీరోయిన్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు.. ‘ఫేక్’ న్యూస్!!

కొద్ది రోజుల క్రితం అనుష్క ప్రెగ్నెంట్ అని గుడ్ న్యూస్ ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అనుష్క శర్మ విరాట్ కోహ్లీ ఎంతో సంతోషంగా చెప్పిన ఆ వార్త అభిమానులను కూడా ఆనందపరిచింది. ఇక వారి బిడ్డ జనవరిలో రానున్నట్లు క్లారిటీ కూడా ఇచ్చేశారు. అయితే అలాంటి సమయంలో, అనుష్క ప్రభాస్ చిత్రం ఆదిపురుష్ లో భాగం కానున్నట్లు కొన్ని హిందీ మీడియా ఛానెల్స్ లో వార్తలు వచ్చాయి.

ఇక లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం ఇది ఖచ్చితంగా ఫేక్ న్యూస్ అని రుజువయ్యింది. రామాయణ కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఆది పురుష్ లో సీత పాత్రకు అనుష్క శర్మను ఫిక్స్ చేసినట్లు కథనాలు వచ్చాయి. ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక సీత పాత్ర విషయంలో వచ్చిన కథనాల్లో నిజం లేదని చిత్ర యూనిట్ వర్గాలు కూడా కొట్టి పారేశాయి. ఇంకా ఆ పాత్రకు ఎవరిని ఫిక్స్ చేయలేదని తెలుస్తుంది. ఇక వీలైనంత త్వరగా రూమర్స్ డోస్ ఎక్కువవ్వకముందే సీత పాత్రపై క్లారిటీ ఇవ్వాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. వచ్చే నెలలో ఒక స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం.