‘సమంత’ సరికొత్త సంతోషానికి అసలు కారణం ఇదే!!

అక్కినేని వారి కోడలు సమంత సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా కనిపిస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి కూడా ఆమె ఎక్కువగా వర్కౌట్ టిప్స్ తో ఫాలోవర్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా 108 సూర్య నమస్కారం అనే కాన్సెప్ట్ ఆమె జీవితంలో చాలా మార్పు తీసుకొచ్చిందట.

ఆమె స్పెషల్ ఫొటో చూస్తేనే అర్థమవుతోంది. ఆ మొహంలో ఆనందం లైట్ లా వెలిగిపోతోందని చెప్పవచ్చు. సూర్య నమస్కారం యోగాలోనే అతి ముఖ్యమనది అంటూ మనసులో ఒక ప్రశాంతతను కలిగించడమే కాకుండా చర్మసౌందర్యాని పెంచడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందని సమంత వివరణ ఇచ్చింది. అదే విధంగా సూర్య కిరణాల వలన డెర్మాఫ్రాక్ విటమిన్ ఇన్ఫ్యూషన్ థెరపీ … మీ చర్మంలోకి టన్నుల మంచితనాన్ని చొప్పించడం .. చక్కటి గీతలతో సహాయపడుతుందని తెలిపింది. ఇక ఫైనల్ గా మొహంలో అలా గ్లో వచ్చేలా 108 సూర్య నమస్కారం లాభాన్ని ఇస్తుందని వివరణ ఇచ్చారు.