Anasuya: రంగ‌మ్మ‌త్త‌పై నెటిజ‌న్ అస‌భ్య‌ప‌ద‌జాలం.. పేరెంట్స్ అలా పెంచ‌లేదు నన్ను: అన‌సూయ

‌Anasuya: జ‌బ‌ర్ద‌స్త్ హాట్ యాంక‌ర్ అన‌సూయ బుల్లితెర ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. అన‌సూయ ప‌లు షోలోతో పాలు సినిమాల్లో కూడా న‌టిస్తుంది. ఈ నేప‌థ్యంలో రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన రంగ‌స్థ‌లం మూవీలో అన‌సూయ రంగ‌మ్మ‌త్త‌గా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకుంది. దీంతో ప‌లు చిత్రాల్లో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది. ఆక‌ర్షించే అందంతో పాటు అద్భుత‌మైన టాలెంట్ ఉన్న Anasuya అన‌సూయ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందనే విష‌యం తెలిసిందే.

anasuya show

ఈమె చేసే పోస్ట్‌లు కొంద‌రికి వినోదాన్ని పంచుతుండ‌గా.. మ‌రికొంద‌రు వాటిని ట్రోల్స్ చేస్తుంటారు. వీటిని చాలా లైట్ తీసుకుంటుంది. అలాగే కొన్ని సంద‌ర్భాల్లో త‌ప్పుడు ట్వీట్స్‌కు త‌న‌దైన శైలిలో బ‌దులిస్తుది అన‌సూయ‌. అయితే విష‌యం ఏంటంటే.. మూడేళ్ల కింద‌ట Anasuya అన‌సూయ ఓ షో కోసం యాంక‌రింగ్ చేస్తూ క‌ళ్లు తిరిగి ప‌డిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోల‌ను ఓ నెటిజ‌న్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఈ షో ప‌బ్లిసిటీ కోస‌మే అన‌సూయ అలా క‌ళ్లు తిరిగిప‌డిపోయిన‌ట్లు న‌టించింద‌ని చెబుతూ అస‌భ్య‌ప‌ద‌జాలంతో కామెంట్ చేశాడు. దీంతో Anasuya అన‌సూయ ఆ నెటిజ‌న్‌కు దిమ్మ తిరిగే స‌మాధానం ఇచ్చింది.. ఎప్పుడో మూడేళ్ల కింద‌ట జ‌రిగిన షోను చూపించి ఏదోదే మాట్లాడుతున్నావు. ఇలాంటి కామెంట్ చేయ‌డం చాలా తేలిక‌ని చెప్పింది. త‌న‌కు లోబిపి ఉండ‌డంతో.. ఉద‌యం 5.30గంట‌ల స‌మ‌యంలో జరిగింది. పూర్తిగా తెలుసుకోకుండా ఇలాంటి కామెంట్స్ చేయ‌కు.. 22గంట‌లు నాన్‌స్టాప్‌గా ప‌నిచేయ‌డం వ‌ల్ల క‌ళ్లు తిరిగాయని.. త‌న‌ను అస‌భ్యంగా దూషించాల‌నే ఉద్దేశ్యంతోనే కామెంట్ చేస్తున్నావా?.. తాను కూడా సిగ్గు, భ‌యం లేకుండా అస‌భ్య‌ప‌ద‌జాలంతో దూషించ‌గ‌ల‌ను కాని.. త‌న‌ను త‌న పేరెంట్స్ అలా పెంచ‌లేద‌ని చెప్పుకొచ్చింది Anasuya అన‌సూయ‌.