బ్లూ ఫిల్మ్స్‌లో నటిస్తూ అడ్డంగా దొరికిన టాలీవుడ్ హీరోయిన్

కొంతమంది హీరోయిన్లకు సినిమా అవకాశాలు దొరక్క అడ్డదారులు తొక్కుతున్నారు. కొంతమంది హీరోయిన్లు డ్రగ్స్ రాకెట్ నడుపుతూ పట్టుపట్టగా.. మరికొంతమంది వ్యభిచారం చేస్తూ పట్టబడ్డారు. తాజాగా ఒక హీరోయిన్ బ్లూ ఫిల్మ్స్‌లో నటించడంతో పాటు వాటిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తూ పోలీసులకు దొరికిపోయింది.

gehana vasisth arrest

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. గెహానా వశిష్ట. ఆపరేషన్ ధుర్యోధన సిరీస్‌లో ఐటమ్ సాంగ్స్‌లో నటించిన ఆమె.. ఆ తర్వాత అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి’, ‘నమస్తే’, ‘బి.టెక్‌ లవ్‌ స్టోరీ’, ‘ఐదు’ వంటి సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. కానీ టాలీవుడ్‌లో సక్సెస్ కాలేకపోయింది. దీంతో టాలీవుడ్‌కు దూరమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత బాలీవుడ్‌కి చెక్కేసింది. అయితే అక్కడ కూడా అవకాశాలు రాలేదు.

ఈ క్రమంలో నీలి చిత్రాల్లో నటించడం మొదలుపెట్టింది. తాను నటించిన నీలి చిత్రాలను ఒక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. వాటిని చూడాలంటే సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు కింద రూ.2000 వసూలు చేస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన ముంబై పోలీసులు.. తాజాగా గెహానా వశిష్టను అరెస్ట్ చేశారు.