Kollywood: మాగీ ఐల‌వ్‌యూ.. త‌న‌దైన శైలిలో స్పందించిన‌ హీరోయిన్‌..

Kollywood: కోలీవుడ్ స్టార్ ధ‌నుష్‌- మాళ‌విక మోహ‌న్ జంట‌గా ఓ సినిమా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రాన్ని డైరెక్ట‌ర్ కార్తీక్ న‌రేన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తుండ‌గా.. ఇటీవ‌లే ఈ చిత్ర షూటింగ్ కోసం హైద‌రాబాద్ కు వ‌చ్చారు చిత్ర‌బృందం. ఈ షూటింగ్‌లో ధనుష్‌, మాళ‌విక మోహ‌న్ పాల్గొన‌గా.. ఈ నేప‌థ్యంలోనే ధ‌నుష్‌తో క‌లిసి సినిమా సెట్లో దిగిన ఫోటోను ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేసింది హీరోయిన్ మాళ‌విక మోహ‌న్‌.

Dhanush-malavika

అలాగే Kollywood ధ‌నుష్ గారితో క‌లిసి న‌టించ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని.. మ‌నిద్ద‌రం మ్యాగీ ప్రేమికులం అంటూ ఆమె రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతుండ‌గా.. అయితే ఓ నెటిజ‌న్‌ ఐల‌వ్‌యూ మ్యాగీ అంటూ కామెంట్ చేశారు. దీంతో ఈ కామెంట్‌కు స్పందించింది మాళ‌విక‌.. మాగీని ప్రేమించేవాళ్లంద‌ర్నీ నేను ఇష్ట‌ప‌డ‌తాను అంటూ త‌న‌దైన శైలిలో స‌ర‌దాగా కామెంట్ చేసింది.