రాంచరణ్‌ను పెళ్లి చేసుకుంటానన్న హాట్ బ్యూటీ

మెగా పవర్ స్టార్ రాంచరణ్‌ను పెళ్లి చేసుకుంటానని చెబుతోంది హాట్ యాంకర్, నటి అనసూయ. తన హాట్ హాట్ లుక్స్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఈ అమ్మడు. జబర్దస్త్ షోతో గుర్తింపు పొందిన ఈ బ్యూటీ.. ఇప్పుడు సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషిస్తూ నటిగా కూడా మంచి పేరు సంపాదించుకుంటోంది. ‘రంగస్థలం’ సినిమాతో రంగమ్మత్తగా అనసూయ నటనకు అనేక ప్రశంసలు వచ్చాయి.

ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న అనసూయ. తాజాగా ఒక ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. యాంకర్ శ్రీముఖి తన యూట్యూబ్ ఛానెల్‌లో నిర్వహిస్తున్న ‘ఉమెనియా’ అనే ప్రొగ్రామ్‌లో అనసూయ పాల్గొంది. ఈ సంరద్భంగా కిల్ మ్యారీ హుక్ అప్ క్వశ్చన్ వేసింది శ్రీముఖి. నాగార్జున, సాయిధరమ్ తేజ్, రాంచరణ్ అంటూ మూడు ఆప్షన్స్ ఇచ్చింది.

దీనికి రాంచరణ్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన అనసూయ.. సాయిథరమ్ తేజ్‌ను చంపేస్తానంది. ఇక హుక్ అప్ నాగార్జునతో అని చెప్పింది. అయితే రంగస్థలం సినిమా సమయంలో రాంచరణ్, అనసూయ మంచి ఫ్రెండ్స్ అయ్యారు.