బిగ్‌బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

బిగ్‌బాస్-4 ఇప్పటికే సగం పూర్తైంది. ఇప్పటివరకు 60 ఎసిపోడ్స్ పూర్తవ్వగా.. ఎవరు ఎలిమినేట్ అవుతారనే సస్పెన్స్ ప్రేక్షకుల్లో ప్రతివారం ఉంటూ ఉంటుంది. గత వారం అనారోగ్యంతో నోయెల్ బిగ్‌బాస్ హౌస్ నుంచి వెళ్లిపోవడంతో ఎవరినీ ఎలిమినేట్ చేయలేదు. అయితే ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేట్ ఉంటుంది.

గత వారం ఎలిమినేట్ కావాల్సిన అమ్మ రాజశేఖర్ నోయెల్ పుణ్యమా అని సేవ్ అవ్వగా… ఈ వారం కూడా అతడు నామినేషన్‌లో ఉన్నాడు. ఈ వీక్ అమ్మ రాజశేఖర్ తప్పించుకునే అవకాశాలు లేవని, ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడేనని సమాచారం.

అమ్మ రాజశేఖర్‌పై హౌస్‌లోని మెజార్టీ సభ్యులు గుర్రుగా ఉన్నారు. ఎదుటివారు చెప్పే మాటలను సరిగ్గా వినడని, ప్రతి చిన్న విషయానికి చిన్న పిల్లవాడిలా ప్రవర్తిస్తాడనే ఆరోపణలు అతడిపై బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి కోపడుతూ ఉంటాడని హౌస్‌మేట్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. గత వారం నాగార్జున పెట్టిన టాస్క్‌లో కూడా అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ కావాలని మెజార్జీ హౌస్‌మెట్స్ ఓట్లు వేశారు.