తన తొలి జీతమెంతో చెప్పిన హీరో సూర్య

సూర్య.. తమిళంలో టాప్ హీరోగా ఉన్న ఆయనకు తెలుగులో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. యముడు, సింగం, బ్రదర్స్ లాంటి సినిమాలు తెలుగులోనూ భారీ విజయం సాధించాయి. తమిళంతో పాటు తెలుగులోనూ అమ్మాయిల ఫాలోయింగ్ సూర్యకు బాగానే ఉంది.

గత సంవత్సరం సూర్య హీరోగా వచ్చిన కుప్పన్ సినిమా భారీ విజయం సాధించింది. ఇక సుధ కొంగర-సూర్య కాంబినేషన్‌లో వస్తున్న ‘సూరరై పోరు’ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్లు అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని సూర్య బయటపెట్టాడు. తాను హీరో కాకముందు ఒక టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో పనిచేశానని, మొదటి జీతం రూ.736 వచ్చాయని చెప్పాడు. తెల్లని కవర్‌లో ఆ జీతం ఇచ్చారని, తనకు ఇప్పటికీ గుర్తు ఉందన్నాడు.