Pushpa Release Date: ‘పుష్ప’ రిలీజ్ డేట్ ఫిక్స్

Pushpa Release Date: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ ఏడాది ఆగస్టు 13న సినిమాను విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు రిలీజ్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో అల్లు అర్జున్ గొడ్డలి పట్టుకుని కాలు మీద కాలు వేసుకుని ఉన్నాడు. భుజం మీద కండువా వేసుకుని వెనుక గ్యాంగ్‌తో అల్లు అర్జున్ కనిపించాడు.

pushpa release date

ఇందులో ఎర్ర చందనం స్మగ్లర్‌గా బన్నీ నటిస్తుండగా.. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా సినిమాగా దీనిని విడుదల చేయనున్నారు. మొత్తం 10 భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తోంది.