ప్రభాస్ ‘సలార్’లో హీరోయిన్ ఎవరో తెలుసా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా సలార్. ఇటీవలే ఈ సినిమా ప్రారంభమవ్వగా.. వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనేది ఫిక్స్ అయింది.

shruti haasan onboard for salaar

ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్‌ను ఎంపిక చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇవాళ శృతిహాసన్ బర్త్ డే సందర్భంగా ఆమెకు సలార్ మేకర్స్ శుభాకాంక్షలు చెప్పారు. అంతకుముందు అనేకమంది బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు రేసులో వినిపించాయి. వాటికి చెక్ పెడుతూ ఇవాళ సలార్ మేకర్స్ అధికారికంగా అనౌన్స్‌మెంట్ చేశారు.