న్యూడ్‌గా కనిపించనున్న అల్లరి నరేష్

టాలీవుడ్‌లో తన కామెడీతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు అల్లరి నరేష్. తన మార్క్ కామెడీతో కామెడీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే కామెడీనే కాదు… ఎమోషనల్ సీన్స్‌ని కూడా అద్భతంగా పండించగలడు అల్లరి నరేష్. ఇటీవల అల్లరి నరేష్‌కు సరైన హిట్లు లేవు. మళ్లీ హిట్‌ను అందుకునేందుకు నరేష్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం బంగారు బుల్లొడు సినిమాతో త్వరలో అల్లరి నరేష్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

naresh nude character

ఇందులో బాలకృష్ణ సూపర్ హిట్ పాట అయిన స్వాతిలోముత్యం పాటను రీమేక్ చేశారు. దీంతో పాటు నాంది అనే సినిమాలో నరేష్ నటిస్తున్నాడు. అయితే నాందిలో ఒక సీన్‌లో నరేష్ న్యూడ్‌గా కనిపిస్తాడట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నరేష్ ఈ విషయాన్ని వెల్లడించాడు. న్యూడ్ సీన్‌లో నటించేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని నరేష్ చెప్పాడు.