Anil Ravipudi: ఎఫ్‌-3 డైరెక్ట‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో గాలి సంప‌త్ చిత్రం..

Anil Ravipudi: టాలీవుడ్ యంగ్ టాలెంట్ హీరో శ్రీవిష్ణు, న‌ట‌కిరీటీ రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో గాలి సంప‌త్ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాను అనిష్ డైరెక్ష‌న్ చేస్తుండ‌గా.. ఎస్‌. కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్ర‌స్తుతం సెట్స్‌పై ఉన్న ఈ చిత్రానికి ఎఫ్-2, స‌రిలేరు నీకెవ్వ‌రు తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. అలాగే ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ కూడా చేప‌ట్టారు.

Gaalisampath

దీనిపై Anil Ravipudi ఆయ‌న స్పందిస్తూ.. మొట్ట మొద‌టిసారి గాలి సంప‌త్ సినిమాను ప్ర‌క‌టించిన‌ప్పుడు నేను దీనికి స్ర్కీన్‌ప్లేను అందించాల‌ని అనుకున్నాను. కానీ ఇక నుంచి ద‌ర్శ‌క‌త్వం ప‌ర్య‌వేక్ష‌ణ కూడా చేస్తున్నాను. స‌మిష్టి కృషి వ‌ల్లే ప‌నులు అర్ధ‌వంతంగా ఉంటాయ‌ని నేనే ఎల్ల‌ప్పుడూ న‌మ్ముతాను అంటూ అనిల్ రావిపూడి త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఇక నిన్న ఈ చిత్ర షూటింగ్‌లో Anil Ravipudi అనిల్ రావిపూడి యాక్షన్‌, క‌ట్ చెప్తూ.. మూవీ టీంతో క‌లిసి కూర్చొని మానిట‌ర్ చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ప్ర‌స్తుతం చిత్రం ఎఫ్‌-3. ఇందులో విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్‌, త‌మ‌న్నా, మెహ్రీన్ పిర్జాదా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.