ఓటీటీలో కాదు.. థియేటర్లలోకే అక్షయ్ మూవీ

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా రానున్న బెల్ బాటమ్ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందని వార్తలొచ్చాయి. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌తో మేకర్స్ చర్చలు జరుపుతున్నారని, భారీ రేటకు అమెజాన్ ప్రైమ్‌కి అమ్మేందుకు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై సినిమా యూనిట్ ఎట్టకేలకు స్పందించింది. బెల్ బాటమ్ సినిమాను ఓటీటీలో విడుదల చేసే ప్రసక్తే లేదని, ఆ వార్తలన్నీ అవాస్తవమని తెలిపింది.

bell bottam in theaters

బెల్ బాటమ్ సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తామని సినిమా యూనిట్ ప్రకటించింది. గతంలో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. దీంతో బెల్ బాటమ్ సినిమా కూడా ఓటీటీలో విడుదల అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బెల్ బాటమ్ మేకర్స్ క్లారిటీ ఇచ్చింది.