ఇండియా నుంచి అక్షయ్ కుమార్ ఒక్కడే

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే టాప్ 100 సెలబ్రెటీల జాబితాను తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసింది. ఇందులో 590 మిలియన్ డాలర్ల సంపాదనతో అమెరికా టీవీ రియాలిటీ స్టార్ నటి కైలీ జెన్నర్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇక రెండో స్థానంలో కన్యే వెస్ట్‌ ఉన్నారు. అయితే ఇండియా నుంచి టాప్ 100లో ఒక్క అక్షయ్ కుమార్ మాత్రమే ఉండటం విశేషం. 53వ స్థానంలో అక్షయ్ ఉండగా.. ఈ ఏడాదిలో ఆయన సంపాదన 48.5 మిలియన్లగా ఫోర్బ్స్ తేల్చింది.

akshay kumar

ప్రస్తుతం అక్షయ్ ‘బోల్ బచ్చన్’, ‘బెల్ బాటమ్’ సినిమాల్లో నటిస్తున్నాడు. దీని తర్వాత యష్ రాజ్ ఫిల్మ్ నిర్మించనున్న ‘పృధ్వీరాజ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటీవల ‘బెల్ బాటమ్’ సినిమా షూటింగ్ పూర్తవ్వగా.. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.

అక్షయ్ కుమార్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉంటాడు. ఒక సినిమా విడుదల కాకముందే రెండు, మూడు సినిమాలను లైన్లో పెడతాడు. అంతేకాకుండా బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సంపాదించుకునే హీరోగా అక్షయ్‌కు పేరుంది. ప్రస్తుతం వరుస హిట్ సినిమాలతో అక్షయ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడితో సినిమాలు తీసేందుకు దర్శక, నిర్మాతలు పోటీ పడుతున్నారు.