సేవ చేస్తానంటున్న దిల్ రాజు

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఇవాళ తన 50వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు ట్విట్టర్‌లో బర్త్ డే విషెస్ చెబుతున్నారు. మహేష్ బాబు, ప్రభాస్‌తో పాటు పలువురు హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు దిల్‌రాజుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. జీవితాంతం ఇలాగే హ్యాపీగా ఉండాలని విష్ చేస్తున్నారు.

DIL RAJU

తన బర్త్ డే సందర్భంగా నిన్న నైట్ దిల్ రాజు పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి సినీ ఇండస్ట్రీ నుంచి హీరోలందరూ హాజరయ్యారు. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రాంచరణ్, చిరంజీవి, వరుణ్ తేజ్ హాజరయ్యారు. ఇక నితిన్, నాగచైతన్య తమ భార్యలతో కలిసి ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు. కేజీఎఫ్ హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఈ బర్త్ డే పార్టీకి అటెండ్ అయ్యారు.

ఇక హీరోయిన్ల నుంచి పూజాహెగ్దే, రాశీఖన్నా, నివేదా పేతురాజ్, అనుపమా పరమేశ్వరన్ హాజరై సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకరు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌గా కూడా ఆయనకు పేరుంది. టాప్ హీరోలందరితో ఆయన సినిమా చేశారు. దిల్ రాజు అసలు పేరు వెంకటరమణారెడ్డి. 2003లో ‘దిల్’ సినిమాతో నిర్మాతగా కెరీర్ మొదలుపెట్టిన ఆయన.. ఆ సినిమా పేరునే తన పేరుగా మార్చుకున్నారు. గత కొద్దిరోజుల క్రితం ఆయన భార్య చనిపోవడంతో.. ఇటీవలే లాక్‌డౌన్‌లో రెండో పెళ్లి చేసుకున్నారు. నిర్మాతగా సక్సెస్ అయిన ఆయన.. త్వరలోనే సేవా రంగంలోకి కూడా అడుగుపెడతానని చెబుతున్నారు.