చిరుతో నటించాలని లేదు

సౌతిండియాలో లేడీ సూపర్‌స్టార్, లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకుంది విజయశాంతి. హీరోలతో సమానంగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. లేడీ ఓరియెంటెండ్ సినిమాలకు ఆమె పెట్టింది పేరు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలందరితో సినిమాలు చేసిన ఆమె.. యంగ్ హీరోల సినిమాల్లో కూడా పలు పాత్రలలో నటించింది. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది విజయశాంతి.. ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కీలక పాత్రతో అందరినీ ఆకట్టుకుంది.

CHIRANJEVI

ఇటీవలే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన విజయశాంతి.. ఇక సినిమాలు చేయనని చెబుతోంది. తాజాగా ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టింది. సినిమాల్లో నటించాలనే ఆసక్తి తనకు అసలు లేదంది. ‘చిరంజీవితో నటించే అవకాశం ఉందా’ అని ప్రశ్నించగా.. ఆయనతో నటించాలని లేదని చెప్పింది.

చిరుతోనే కాదు.. అసలు ప్రస్తుతం సినిమాల్లో నటించాలని లేదంది. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాల గురించి ఆలోచించే సమయం లేదని, తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానంది. విజయశాంతి మాటలను బట్టి చూస్తుంటే.. ఆమె ఒక సినిమాలకు గుడ్ బై చెప్పినట్లే తెలుస్తోంది