బీ రెడీ అంటున్న అజిత్

కోలీవుడ్‌ స్టార్ హీరోలలో అజిత్ ఒకరు. తమిళనాట అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో కూడా అతడేనని చెప్పవచ్చు. తెలుగు ప్రేక్షకుల్లో కూడా అజిత్‌కు అభిమానులు ఉన్నారు. తెలుగులోకి డబ్బింగ్ అయిన అజిత్‌కు సంబంధించిన చాలా సినిమాలు ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యాయి. దీంతో తెలుగునాట అజిత్ అంటే హీరోగా అందరికీ సుపరిచితమే.

AJITH

ప్రస్తుతం హీరో అజిత్ ‘వాలిమై’ అనే సినిమాలో నటిస్తుండగా.. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వినోద్ డైరెక్షన్‌లో బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా వల్ల వాయిదా పడింది. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమవ్వగా.. జనవరి నాటికి షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగులోనూ డబ్బింగ్ చేసి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో హుమా కురేషి హీరోయిన్‌గా నటిస్తుండగా.. టాలీవుడ్ యంగ్ హీరో కార్తీకేయ ఇందులో విలన్‌గా కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి.