కేజీఎఫ్-2 నుంచి క్రేజీ అప్డేట్

రాకింగ్ స్టార్ యష్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. దీంతో కేజీఎఫ్-2ని తీయాలని మేకర్స్ భావించారు. యశ్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో కేజీఎఫ్-2 తెరకెక్కుతుండగా.. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. త్వరలో దీని షూటింగ్ ముగియనుండగా.. వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

KGF2

అయితే త్వరలో కేజీఎఫ్-2 నుంచి క్రేజీ అప్డేట్ రానుందని సమాచారం. జనవరి 8న హీరో యష్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా కేజీఎఫ్-2 టీజర్‌ను విడుదల చేయాలని సినిమా యూనిట్ భావిస్తుందట. అదే రోజులు సినిమా విడుదలకు సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశముంది.

శ్రీనిధి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రీవీ బాస్రుర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కేజీఎఫ్-1 భారీ విజయం సాధించడంతో.. కేజీఎఫ్-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం కేజీఎఫ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.