ఈటీవి… తెలుగులో ఉన్న టాప్ చానెల్స్ లో ఒకటి. 1984 నుంచి ఇప్పటివరకూ టాప్ చానెల్స్ లో ఒకటిగా ఉన్న ఈటీవిని రామోజీ రావు దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఎన్ని చానెల్స్ వచ్చినా ఎంత పోటి ఎదురైనా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తో చానెల్ ని ముందుకి నడిపించడంలో రామోజీ రావు అండ్ టీం కంప్లీట్ గా సక్సస్ అయ్యారు. మూడున్నర దశాబ్దాల ఈ ప్రయాణాన్ని కొత్త దారుల్లోకి నడిపిస్తే ఈటీవి టీం నుంచి కొత్త ఒటీటి రాబోతోంది. డిజిటల్ కంటెంట్ వైపు అడుగులు వేయాలని ఆలోచిస్తున్న రామోజీ రావు, ఈ ప్లాట్ ఫాం కోసం దాదాపు 200 కోట్లు కర్చు పెట్టబోతున్నారట. ఉషా కిరణ్ మూవీస్ లో నిర్మించిన ఎన్నో క్లాసిక్ సినిమాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఓటీటీ యాప్ లో స్ట్రీమ్ చేయనున్నట్లు సమాచారం. ఈ ఓటిటీ లో పాత సినిమాలతో పాటు కొత్త సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లు నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.
ప్రస్తుతం డిజిటల్ వరల్డ్ లో అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి అగ్ర స్థాయి ఓటీటీ సంస్థలు కూడా లోకల్ కంటెంట్ తో ప్రేక్షకులను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నాయి. తెలుగు డెడికేటెడ్ ‘ఆహా’ ఓటిటీ కూడా ఫారిన్ ప్లాట్ ఫామ్స్ కి గట్టి పోటి ఇస్తుంది. వీటికి తోడు డిస్నీ+హాట్ స్టార్, సన్ ఎన్ఎక్స్ట్ , జీ 5, స్పార్క్ లాంటి సైట్స్ ఉండనే ఉన్నాయి. కరోనా పాండమిక్ సమయంలో థియేటర్స్ మూతబడటంతో.. ఓటీటీలే ప్రత్యామ్నాయంగా మారాయి. ఈ నేపథ్యంలో అప్పటికే ఉన్న ఎస్టాబ్లిష్డ్ ఓటీటీలని దాటి ఈటీవి ఒటిటిని ఎలా ముందుకి తీసుకోని వెళ్తారు? ఎలాంటి కంటెంట్ తో వస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. తమ బలాన్ని అర్ధం చేసుకోని ముందుకి నడిపిస్తే రామోజీ రావు తన ఒటిటిని సక్సస్ చేయగలరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.