‘మా’ రేస్ లోకి జీవిత రాజశేఖర్? రెండు రోజుల్లో క్లారిటీ…

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు సెప్టెంబర్ లో జరగనున్నాయి. ఇంకా మూడు నెలల సమయం ఉన్నా కూడా టాలీవుడ్ లో ఎన్నికల వేడి ఇప్పటికే మొదలయ్యింది. నటుడు ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండగా, అతనికి పోటిగా మంచి విష్ణు లైన్ లోకి వచ్చాడు. ఈ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుంది అనుకునే టైంకి నటి హేమ కూడా అధ్యక్ష పదికి పోటి పడుతూ మా ఎన్నికల్లో పోటి చేయడానికి రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ ఎన్నికలని మరింత రసవత్తరం చేస్తూ ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్న జీవిత రాజశేఖర్ కూడా అధ్యక్ష పదవి కోసం పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

ప్రస్తుతం జీవిత ‘మా’ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్న జీవిత తన మద్ధతుదారులు, సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయమై జీవిత రెండుమూడు రోజుల్లో స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. జీవిత రేస్ లోకి రావడం ఎన్నికలని రసవత్తరం చేయడం గ్యారెంటి. మరి ఈ పోటీలో ఎవరు గెలుస్తారు? ఎలాంటి ప్రణాళికతో ముందుకి వస్తారు అనేది చూడాలి.