బాహుబలి బాటలో సలార్? ఆ రేంజ్ హిట్ గ్యారెంటినా?

ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ చేసిన సినిమా బాహుబలి. జక్కన్న చెక్కిన ఈ మహాకావ్యం ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లు రాబట్టి తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది. రెండు భాగాలుగా వచ్చిన ఈ మూవీని రాజమౌళి ముందుగా ఒక పార్ట్ గానే రిలీజ్ చేయాలి అనుకున్నాడు కానీ కథలో స్పాన్ ఉండడంతో మేకర్స్ రెండు పార్ట్శ్ కి వెళ్లారు. రాజమౌళి ప్లాన్ వర్కౌట్ అయ్యి బాక్సాఫీస్ దెగ్గర బాహుబలి వసూళ్ళ వర్షం కురిపించింది. ఇదే ప్లాన్ ని ఫాలో అవుతూ చాలా ప్రాజెక్ట్స్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్దమవుతున్నాయి. ఇందులో సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప కూడా ఉంది. తన క్రియేట్ చేసిన ట్రెండ్ ని తానే ఫాలో అవుతూ ప్రభాస్ సలార్ మూవీని రెండుగా విడగొట్టడానికి సిద్దమయ్యాడు. కెజీయఫ్ సినిమాని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేస్తున్న లేటెస్ట్ మూవీ సలార్. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందుతుంది.

భారి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు పార్టులుగా రిలీజ్ కాబోతుందట. కేజేఎఫ్ మాదిరిగానే రెండు భాగాలుగా చేస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ ప్రభాస్ ముందు ప్రపోజల్ పెట్టాడని.. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయట. ప్రస్తుతానికి ఇది కేవలం డిస్కషన్ స్టేజ్ లో ఉన్న ఈ విషయానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉండడంతో సలార్ ని టు పార్ట్శ్ గానే చూసే అవకాశం ఉంది. కథలో నిజంగా అంత విషయం ఉంటే, కథనాన్ని రెండు భాగులుగా డివైడ్ చేసే ఛాన్స్ ఉంటేనే ఇలాంటి ప్రయోగాలు చేయాలి కానీ మార్కెట్ కోసం ఆ ఆలోచన చేస్తే మాత్రం ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ కి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది.