హీరో సల్మాన్ ఖాన్ తొలి జీతం ఎంతో తెలుసా?

బాలీవుడ్‌లో హీరో సల్మాన్ ఖాన్ టాప్ హీరోగా కొనసాగుతూనే ఉన్నాడు. ఎంతమంది యంగ్ హీరోలు వచ్చినా.. వారితో పోటీ పడుతూ స్టార్ హీరోగా కొనసాగుతూనే ఉన్నాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునే హీరోలలో సల్మాన్ ఒకడు. సిల్వర్ స్క్రీన్‌తో పాటు బుల్లితెరపై బిగ్‌బాస్ హోస్ట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. బాలీవుడ్‌లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సల్మాన్.. ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడు.

salman khan

రాత్రికి రాత్రి సల్మాన్ స్టార్‌గా ఎదగలేదు. దీని వెనుక ఎంతో శ్రమ ఉంది. సినిమాల్లోకి రాకముందు బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్‌గా సల్మాన్ పనిచేశాడు. అప్పుడు సల్మాన్ ఖాన్‌కు రూ.75 శాలరీ ఇచ్చారట. అదే సల్మాన్ మొదటి శాలరీ. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సల్మాన్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. అప్పట్లో జూనియర్ ఆర్టిస్ట్ తీసుకునే రెమ్యూనరేషన్ కంటే ఇది చాలా తక్కువ అని సల్మాన్ చెప్పాడు.

మొదట ‘మైనే ప్యార్ కియా’ సినిమాలో సల్మాన్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. సల్మాన్ సినిమాల్లోకి అడుగుపెట్టి ఈ సంవత్సరానికి 32 ఏళ్లు అవుతుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘అంతిమ్: ద ఫైనల్ ట్రూత్ అనే’ సినిమాలో నటిస్తున్నాడు. మహేశ్ మంజేర్కర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.