“యునైటెడ్ ఆడియో మరియు మ్యూజిక్ డైరెక్టర్ చందన్ శెట్టి కలయికలో న్యూ ఇయర్ పార్టీ సాంగ్ “పార్టీ ఫ్రీక్” రిలీజ్”!!

కన్నడ ఇండస్ట్రీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ చందన్ శెట్టి ప్రముఖ ఆడియో కంపెనీ యునైటెడ్ ఆడియో లేటెస్ట్ గా రిలీజ్ చేసిన న్యూ ఈయర్ రాప్ సాంగ్ ‘‘పార్టీ ఫ్రీక్’’ అక్కడ దుమ్మురేపుతుంది.కేవలం రెండు రోజుల్లోనే 2 మిలియన్ పైగా వ్యూస్ క్రాస్ చేసి చార్ట్ బస్టర్ గా నిలిచింది.ఇప్పుడు ఈ సాంగ్ తెలుగులో రిలీజ్ అయింది. న్యూ ఈయర్ సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పార్టీ ఫ్రీక్ సాంగ్ అందరూ ఎంజాయ్ చేసేలా ఉంది.

చందన్ శెట్టి మ్యూజిక్ కంపోజర్,రాపర్.కన్నడ ఇండస్ట్రీలో ప్రస్తుతం తన పాటలతో అందరికీ హాట్ ఫేవరేట్ గా మారాడు. రీసెంట్ గా “పొగరు” సినిమాలో బ్లాక్ బస్టర్ అయిన ‘‘కరాబు’’ సాంగ్ ను కంపోజ్ చేసింది కూడా ఈయనే.ఆ పాట అక్కడే కాదు..ఇక్కడ కూడా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ పార్టీ ఫ్రీక్ సాంగ్ కూడా అంతే క్యాచీ గా ఉండటం ప్లస్ పాయింట్. చైతన్య లకంసాని నేతృత్వంలో ని యునైటెడ్ ఆడియో ఈ సాంగ్ ని ప్రొడ్యూస్ చేసింది. తెలుగులో తన సాంగ్ రిలీజ్ కావడం పట్ల చాలా హ్యాపీగా ఉందంటున్నాడు చందన్.‘‘కరాబు’’ సాంగ్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగా నచ్చిందో ఈ సాంగ్ కూడా అందరికీ నచ్చుతుందనీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.