పవన్ ‘వకీల్ సాబ్’ లుక్ లీక్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మూడు సంవత్సరాల తర్వాత పవన్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో.. దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ సృష్టించాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుండగా.. ఇవాళ షూటింగ్ ముగిసినట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. షూటింగ్ ముగిసిందని, త్వరలోనే పవర్ విడుదల అవుతుందని ట్విట్టర్‌లో పేర్కొంది.

VakeelSaab

జనవరి 1న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. సమ్మర్‌లో దీనిని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో లాయర్ పాత్రలో పవన్ నటిస్తుండగా.. హీరోయిన్లుగా శృతిహాసన్, అంజలి, నివేదా థామస్‌లు నటిస్తున్నారు.

తాజాగా ‘వకీల్ సాబ్‌’ సినిమాకి సంబంధించిన ఒక లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఇందులో పవన్ పోలీస్ షీల్డ్ పట్టుకుని ఉన్నాడు. ఇది హైదరాబాద్‌లో జరుగుతున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్‌లో తీసిన ఫొటో అని తెలుస్తోంది. కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది వైరల్‌గా మారింది. వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.