22 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ స్టార్ కాంబో రిపీట్

కోలీవుడ్ సూపర్ స్టార్ కమల్ హాసన్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో ‘విక్రమ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ‘ఖైదీ’ సినిమాతో స్టార్ డమ్‌ను అందుకున్న లోకేష్ కనగరాజ్.. ఇప్పుడు విజయ్ హీరోగా వస్తున్న ‘మాస్టర్’ సినిమాకు దర్శకత్వం వహించాడు. మాస్టర్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మాస్టర్’ సినిమా పూర్తి కావడంతో.. త్వరలో కమల్‌హాసన్‌తో చేయనున్న ‘విక్రమ్’ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు.

kamal hasan

తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త హాట్‌టాపిక్‌గా మారింది. ఇందులో ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, డైరెక్టర్ ప్రభుదేవా కీలక పాత్రలలో నటించనున్నాడట. 1988లో విడుదల అయిన ‘నవ్వండి లవ్వండి’ అనే సినిమాలో చివరిగా కమల్‌హాసన్‌తో కలిసి ప్రభుదేవా నటించాడు. ఈ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు. ఇప్పుడు 22 ఏళ్ల తర్వాత మళ్లీ కమల్‌హాసన్‌తో కలిసి ప్రభుదేవా నటించడం ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు రాజకీయాలతో కమల్ బిజీగా ఉన్నాడు. త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగనున్న క్రమంలో.. రాజకీయలపై కమల్ ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం విక్రమ్ సినిమాతో పాటు భారతీయుడు 2 సినిమాలో కమల్ నటిస్తున్నాడు.