అప్పుడు తండ్రి, ఇప్పుడు కొడుకు… పేరు నిలబెట్టాలి

తెలుగులో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ హిట్స్ ఇస్తున్న హీరో అక్కినేని నాగ చైతన్య. ప్రస్తుతం లవ్ స్టొరీ, థాంక్యు సినిమాలు చేస్తున్న చై త్వరలో బాలీవుడ్ ఇవ్వనున్నాడు. ఆమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’. ఈ సినిమాలో ముందుగా విజయ్ సేతుపతి నటించాల్సి ఉండగా, డేట్స్ క్లాష్ అవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి సేతుపతి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ నాగ చైతన్యకి వచ్చింది. ఈ సినిమాతో చై బాలీవుడ్ డెబ్యు ఇస్తున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్ గా కొత్త లుక్లో కనిపించనున్నాడట. లడఖ్ లో జరుగుతున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ లో చైతన్య లాల్ సింగ్ చద్దా టీంతో జాయిన్ అయ్యాడు. ఆర్మీ అధికారి బాలా పాత్ర కోసం నాగచైతన్య ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. కఠినమైన వ్యాయామాలతో శరీరాకృతిని తీర్చిదిద్దుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కశ్మీర్‌ లడఖ్‌లో జరుగుతోంది. 

ఈ షూటింగ్‌లో నాగచైతన్య పాల్గొంటున్నారని, ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ సెట్స్ నుంచి బయటకి వచ్చిన ఆమీర్ ఖాన్, నాగ చైతన్య ఉన్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హాలీవుడ్‌ క్లాసిక్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’ (1994) ఆధారంగా లాల్ సింగ్ చద్దా తెరకెక్కుతోంది. బాలీవుడ్ లో ఖుదా గవా, క్రిమినల్, ద్రోహి లాంటి హిట్ సినిమాల్లో నటించిన కింగ్ నాగ్ కూడా loc కార్గిల్ మూవీలో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించి మెప్పించాడు. 2003లో వచ్చిన ఈ మూవీలో నాగార్జున మేజర్ పద్మపాణి ఆచర్య పాత్రలో అద్భుతంగా నటించాడు. భారి బాలీవుడ్ స్టార్ కాస్ట్ ఉన్న మూవీలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నాగ్, ఇప్పుడు లాల్ సింగ్ చద్దాతో చైతన్య కూడా గ్రాండ్ బాలీవుడ్ డెబ్యు ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంటాడెమో చూడాలి.