దివ్యాన్ష కౌశిక్ ఈ మూవీతో అయినా స్టార్ అవుతుందా?

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. #RT68 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ షూటింగ్ మొదలయ్యింది. లీడ్ పైర్ రవితేజ, దివ్యాన్ష కౌశిక్ మధ్య సీన్స్ ని షూట్ చేస్తున్నారు. నాగచైతన్య నటించిన మజిలీ మూవీలో ఫస్టాఫ్ హీరోయిన్ గా నటించిన దివ్యాన్ష కౌశిక్ మంచి పేరు తెచ్చుకుంది. నాగ చైతన్య ప్రేమికురాలిగా లిప్ లాక్స్ తో పాటు కాస్త హాట్ సీన్స్ లోనూ కనిపించిన ఈ గ్లామరస్ హీరోయిన్ సెకండ్ హాఫ్ లో కనిపించదు. ఇక్కడి నుంచి సమంతా సినిమాని నడిపిస్తుంది. మజిలీ మూవీ సూపర్ హిట్ అయ్యింది కానీ సమంత క్రేజ్ ముందు దివ్యాన్షకి తగిన గుర్తింపు దక్కలేదు.

దీని వాళ్ల హిట్ అయిన సినిమాలో నటించినా కూడా దివ్యాన్షకి సెకండ్ మూవీ ఛాన్స్ రావడానికి టైం పట్టింది. లేట్ గా అయినా సరే సాలీడ్ ఆఫర్ పట్టేసిన దివ్యాన్ష #RT68పై చాలా హోప్స్ పెట్టుకుంది. దివ్యన్షా కౌశిక్ ఈ సినిమాతో సాలీడ్ హిట్ అందుకుంటే మాత్రం టాలీవుడ్ లో సీనియర్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకోవడం పక్కా అనే టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా టక్కర్ మూవీతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దివ్యన్షా… ఈ రెండు ప్రాజెక్ట్స్ తో తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా ఎంతవరకు సక్సెస్ అవుతుంది… ఏ మేరకు స్టార్ డం సాధిస్తుంది అనేది చూడాలి.