హిందీ హిట్ లో దంగల్ హీరోయిన్ ఫిక్స్…

తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమా హిట్-ది ఫస్ట్ కేస్. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ విశ్వక్ సేన్ కి, డైరెక్టర్ శైలేష్ కొలనుకి మంచి బ్రేక్ ఇచ్చింది. నాని, ప్రశాంతి కలిసి నిర్మించిన హిట్ మూవీకి ఇప్పుడు తెలుగులో అడవి శేష్ హీరోగా హిట్2 రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే హిట్ మూవీ హిట్ అయిన వెంటనే స్టార్ ప్రొడ్యూసర్ డీల్ రాజు, ఈ మూవీ బాలీవుడ్ రైట్స్ ని సొంతం చేసుకోని అక్కడ రీమేక్ చేయడానికి సిద్దమయ్యాడు. తెలుగు మూవీని డైరెక్ట్ చేసిన శైలేష్ కొలను, ఈ రీమేక్ ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటివలే అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ లో రాజ్ కుమార్ రావ్ హీరోగా నటిస్తూ ఉండగా దంగల్ ఫేమ్ సాన్య మల్హోత్రాని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. ఈ విషయాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ట్వీట్ చేశారు. తెలుగులో సాన్యా రోల్ ని చిలాసౌ ఫేమ్ రుహాని శర్మ నట్టించింది. తెలుగులో హిట్ అయిన సినిమాలని బాలీవుడ్ లో రీమేక్ చేసే ట్రెండ్ నడుస్తున్న ఈ సమయంలో హిట్ మూవీకి హిందీలో మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.