Karnataka: పోలీసుస్టేష‌న్‌లో కేజీఎఫ్ హీరో త‌ల్లి .. య‌శ్‌ను అడ్డుకున్న గ్రామ‌స్థులు!

Karnataka: ప్ర‌ముఖ క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్‌.. కేజీఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు సంపాదించుకున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ప్ర‌స్తుతం కేజీఎఫ్2 చిత్ర విడుద‌ల‌పై బిజీగా ఉన్నాడు. కాగా పొలం విష‌యంలో య‌శ్ త‌ల్లితో గ్రామ‌స్థులు గొడ‌వ‌కు దిగారు. వివ‌రాల్లోకి వెళితే.. య‌శ్ త‌ల్లి స్వ‌స్థ‌లం క‌ర్ణాట‌కలోని హాస‌న్ జిల్లా.Karnataka హాస‌న్ స‌మీపంలోని తిమ్మాపుర గ్రామంలో ఇటీవ‌లే 80 ఎక‌రాల భూమిని య‌శ్ కుటుంబం కొనుగోలు చేసింది. అయితే ఆ 80 ఎక‌రాల కోసం దారిని మూసేశారు. దీంతో ఏళ్ల‌కు ఏళ్లుగా సాగు చేస్తున్న త‌మ‌కు త‌మ పొలాల్లోకి వెళ్ల‌కుండా దారి మూసేయ‌డంపై Karnataka తిమ్మాపుర గ్రామ‌స్థులు మండిప‌డుతున్నారు.

Hero yash

ఇది కాస్త ముదిరి య‌శ్ త‌ల్లితో వారు వాగ్వాదానికి దిగారు. ఈ క్ర‌మంలోనే గ్రామ‌స్థులు దుద్ద పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇరు వ‌ర్గాల వారిని పోలీసుస్టేష‌న్‌కు పిలిచి పంచాయితీ నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలోనే య‌శ్ స్వ‌యంగా Karnataka తిమ్మాపుర‌కు వ‌చ్చారు. కాగా పోలీసుస్టేష‌న్‌కు వ‌చ్చిన యశ్‌పై కూడా గ్రామ‌స్థులు ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. పోలీసు స్టేష‌న్‌లో మాట్లాడి వ‌చ్చిన త‌ర్వాత అత‌ని కారును చుట్టుముట్టారు. దీంతో వారిపై య‌శ్ కొంత అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. తాను హాస‌న్ జిల్లాలోనే పుట్టాన‌ని, ఇక్క‌డ భూమి కొనుక్కున్న ఏమైనా చేయాల‌న్న‌ది త‌న క‌ల అని చెప్పాడు.