కేజీఎఫ్-2 రిలీజ్ రోజు హాలీడే ఇవ్వండి

కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్‌1కు సీక్వెల్‌గా దీనికి తెరకెక్కించగా.. అది సూపర్ హిట్ కావడంతో కేజీఎఫ్ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు బ్రేక్ చేసింది.

KGF 2 NATIONAL HOLIDAY

ప్రపంచవ్యాప్తంగా జులై 16న కేజీఎఫ్ 2 విడుదల చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో కేజీఎఫ్ 2 రిలీజ్ రోజు దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని ఒక యశ్ అభిమాని ట్విట్టర్‌లో కోరాడు. ‘సినీ ప్రియులందరూ ఆ సినిమా కోసం ఎప్పటినుంచో నిరీక్షిస్తున్నారని, ఆ సినిమా విడుదల రోజున దయచేసి దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించాలని కోరుతున్నాం మా ఫీలింగ్స్‌ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అది కేవలం సినిమా మాత్రమే కాదు.. మా ఎమోషన్’ అని ప్రధాని మోదీకి ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.