ఆ దర్శకురాలితో మహేష్ సినిమా

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. ఈ సినిమాను తెలుగు దర్శకురాలు సుధా కొంగర అద్భుతంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆమె టేకింగ్‌కు బాగా రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల ఆస్కార్ నామినేషన్స్‌కి కూడా ఈ సినిమా నామినేట్ అయినట్లు వార్తలొస్తున్నాయి. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ఈ సినిమా బాగా హిట్ అయింది.

mahesh with sudha kongara

ఈ క్రమంలో ఆమెతో సినిమాలు చేసేందుకు చాలామంది హీరోలు ముందుకొస్తున్నారు. తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబుతో సుధా కొంగర సినిమా చేయనుందని ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబు కోసం ఆమె ఒక కథను కూడా ఇప్పటికే సిద్ధం చేసింది. త్వరలో ఈ కథను మహేష్‌కి వినిపించనుందని టాక్. ఆమె డైరెక్షన్‌లో సినిమా చేసేందుకు మహేష్ కూడా ఆసక్తితో ఉన్నట్లు సమాచారం.