‘కంగనా’కు వై ప్లస్ సెక్యూరిటీ.. ప్రభుత్వం ఖర్చు ఎంతో తెలుసా?

బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ మొత్తానికి వై సెక్యూరిటీతో మనాలీ చేరుకుంది. తన స్వస్థలాకి రాగానే ఆమె అభిమానులు భారీ స్థాయిలో స్వాగతం పలికారు. ఇక ఈ కంగనాకు వై సెక్యూరిటి కల్పించడంపై సుప్రీం కోర్టు అడ్వొకేట్‌ బ్రిజేష్‌ కలప్ప కౌంటర్లు వేశారు.

ప్రభుత్వానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా అంటూ దాదాపు 10లక్షల రూపాయల భారం పడుతోందని ప్రజల ట్యాక్స్ ని ఇలా ఎన్ని రోజులు ఉపయోగిస్తారో అని కామెంట్ చేశారు. అలాగే కంగనా హిమాచల్ చేరుకుంది కాబట్టి వై ప్లస్ సెక్యూరిటీని వెనక్కి పంపిస్తారా అని ట్వీట్ చేయడంతో అందుకు కంగనా కూడా స్పందించారు. ఇంటిలిజెన్స్ బ్యూరో సమాచారం మేరకు ఒక మనిషికి భద్రత కల్పిస్తారు తప్ప మీరు చెబితేనో, నేను అడిగితేనో భద్రత ఇవ్వరని కంగనా కౌంటర్ ఇచ్చింది. అదే విధంగా దేవుడి దయ వలన త్వరలోనే ఈ సెక్యూరిటీ తగ్గించవచ్చు లేదా పెంచవచ్చని కూడా కంగనా పేర్కొంది.