‘మెగాస్టార్’ కొత్త ప్రాజెక్టులో ‘సాయి పల్లవి’.. రీమేక్ లో స్పెషల్ రోల్!!

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళం బ్యూటీ సాయి పల్లవి అదృష్టం మామూలుగా లేదు. ఒక విధంగా ఆమె టాలెంట్ కూడా ఆమె కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడుతోంది. త్వరలోనే అమ్మడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న చిరు ఆ తరువాత వెంటనే మరో రెండు ప్రాజెక్టులను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు.

బాబీ, మెహర్ రమేష్ దర్శకులను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇక మెహర్ రమేష్ తో తమిళ్ వేదాళం రీమేక్ లో నటించబోతున్నట్లు దాదాపు అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే ఆ సినిమాలో సాయి పల్లవి మెగాస్టార్ చెల్లెలి పాత్రలో నటించబోతున్నట్లు టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఈ క్యూట్ గర్ల్ లవ్ స్టొరీ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే విరాట పర్వం సినిమాను కూడా త్వరలోనే ఫినిష్ చేయనుంది.