ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన మెగాస్టార్ సైరా సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టిన సైరా తెలుగు రాష్ట్రాల్లో డ్రీమ్ రన్ ని కంటిన్యూ చేస్తూనే ఉంది. ఏపీ, టీజీల్లో వంద కోట్ల షేర్ రాబట్టడానికి దగ్గరలో ఉన్న సైరా సినిమా చాలా మంది సినీ అభిమానులు బాహుబలితో పోలుస్తూ మాట్లాడుతున్నారు. బాహుబలి చాలా పెద్ద సినిమా అని, బాహుబలి స్థాయిని సైరా అందుకొలేదని ఎవరికి తోచిన కామెంట్స్ వాళ్లు చేస్తున్నారు. సైరా, బాహుబలి స్థాయి రిజల్ట్ ని అందుకుంటుందా అనే విషయం కాసేపు పక్కన పెట్టేసి ఆలోచిద్దాం.
బాహుబలి ఒక కల్పిత కథ, రాజమౌళి తన మాయాజాలంతో క్రియేట్ చేసిన విజువల్ వండర్. ఒక కొత్త ప్రపంచాన్ని, లేని మనుషులని సృష్టించిన రాజమౌళి బాహుబలి సినిమా చేసి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. అయితే సైరా అలా కాదు, అది ఉద్యమ కథ… ఉద్యమ నాయకుడి కథ. దేశం కోసం పోరాడి ప్రాణాలు వదిలిన రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీర చరిత్ర అది. సైరా సినిమాకి ఉన్న ప్రధాన బలం అదే, చరిత్ర మరిచిన వీరుడి మన ప్రజలకి పరిచయం చేయబోతున్నాం. అదే సైరాకి సెల్లింగ్, ఇంత బలమైన పాయింట్ ఉన్న సినిమాని తీసుకెళ్లి కల్పిత కథతో పోల్చడం కరెక్ట్ కాదు. ఏ సినిమా గొప్పదనం ఆ సినిమాకి ఉంటుంది. సో సైరా ఎన్ని రికార్డులు సృష్టిస్తుంది, ఎంత వసూళ్లు చేస్తుంది అనే విషయాల గురించి మాట్లాడుకోవడం కన్నా… మన వీరుడి కథ ఎంత మందికి తెలిసింది అని ఆలోచించడం బెటర్.