విశ్వక్ సేన్ కొత్త సినిమా అప్డేట్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవలే గాని సినిమాతో మంచి హిట్ ని అందుకున్నారు. అయితే ఈరోజు విశ్వక్ సేన్ పుట్టిన రోజు. కావున ఆయన తరువాయి సినిమాలు అప్డేట్ లు ఈరోజు వస్తాయి అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. వాటిలో ఒకటి అయినా VS12. షైన్ స్క్రీన్స్ ఈ సినిమాని నిర్మించబోతోంది. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థ నటసింహం నందమూరి బాల కృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాని నిర్మించింది. అయితే ఈ సినిమా పేరు లైలా గా రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించనుంది అని సమాచారం. ఈ సినిమాకి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ వహిస్తున్నట్లు, అలాగే తనిష్క్ బాగ్చి సంగీతం వహిస్తున్నట్లు వినిపిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం 04:05 గంటలకు బృందం మరిన్ని వివరాలను వెల్లడించాలని ప్లాన్ చేస్తోంది. రామ్ నారాయణ్ బట్టల రామస్వామి బయోపిక్‌ అనే సినిమా గతంలో దర్శకత్వం వహించిన విష్యం తెలిసిందే.