షూటింగ్ లో గాయపడ్డ హీరో విశాల్

Vishal was injured in a bike accident

తమిళ హీరో విశాల్ నటించిన ‘అయోగ్య’ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఆ సినిమా రిలీజ్ కాకముందే సుందర్. C దర్శకత్వంలో తన కొత్త సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాడు. ఐతే ఈ షూటింగ్ జరుగుతున్న సమయంలో విశాల్ కు గాయాలయ్యాయని సమాచారం.

టర్కీలోని కాప్పడోసియా అనే ప్రాంతంలో ఈ చిత్రానికి సంబంధించిన భారీ యాక్షన్ ఎపిసోడ్ లో భాగంగా ఒక బైక్ చేజింగ్ సీన్ చిత్రీకరిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుందట. ప్రాణాపాయం నుండి తప్పించుకున్న విశాల్ గాయాలతో బయటపడ్డాడు, గాయపడిన అనంతరం విశాల్ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లగా వారు ప్రథమ చికిత్స చేసి కాలికి చేతికి కట్టు కట్టారు. ఈ సందర్భంగా తీసిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో విశాల్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు.. శ్రేయోభిలాషులు మెసేజులు పెడుతున్నారు.

ట్రైడెంట్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విశాల్ కు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా ఐశ్వర్య లక్ష్మి ముఖ్య పాత్రలో కనిపించనుంది.